Sunday, 28 July 2013

Kaavya Kanta Ganapathi Maha muni - Naayana

గురు బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్ పాదం శంకరం లోక శంకరం

ఓం నమః శివాయ

బొబ్బిలికి దగ్గర్లో కలవరాయి అనే ఊరిలో గణపతి శాస్త్రి అనే కవి ఉండేవారు. అతను నవద్వీపానికి కవి సభలో పాల్గొనడానికి వెళ్లారు. ఆ సభకి అధ్యక్షత వహించిన ఉత్తర భారతంలో ప్రసిద్ధి గాంచిన, అంబికాదత్తుడు అనే పండితుణ్ణి చూసి “ఎవరీ మహాశయుడు?” అని అడిగారు. అది విని సభావారంతా ఆశ్చర్య పోయారు.
“త్వరగా కవిత్వం చెప్పే సూర్యుడను, గౌడ బ్రాహ్మణుడను అంబికాదత్తుడను” అని అధ్యక్షుల వారు సగ శ్లోకాన్ని చెప్పారు.
“నీవు అంబికకు దత్తుడవు. నేను నిజ పుత్రుడను.” అని గణపతి శాస్త్రి శ్లోకాన్ని పూర్తి చేసారు.

దాని తరువాత గణపతి శాస్త్రిని పరీక్షించేదుకు సభ వేదిక మీదకి పిలిచారు అధ్యక్షులవారు. వచ్చిన తరువాత అతనికి సమస్యలు ఇచ్చారు. ఈ సమస్యలు ఎలా ఉంటాయి అంటే ఒక వాక్యాన్ని చెప్తారు. దానిని పూరించాలి.

మొదటి సమస్య
“చీర పైట తీసి మామగారిని కోరింది. కాని ఆమె ఉత్తమురాలు”
“భీముని భార్య హిడింబ ఎండా కాల వేడి తట్టుకోలేక మామగారైన గాలిని కోరింది” అని జవాబు ఇచ్చారు. హిడింబ రాక్షస స్త్రీ అందుకే ఆమెని వాడాను, ద్రౌపదిని  కాకుండా అని చెప్పారు కూడా.

రెండవ సమస్య
“సంవత్సరానికి ఒకసారి పార్వతి పతి ముఖాన్ని చూడదు”
“భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడాల్సి వస్తుందని పార్వతి శివుని ముఖాన్ని చూడదు.” వినాయక చవితి నాడు పార్వతి శాపం

మూడవ సమస్య
“చీమ చంద్రుణ్ణి చుంబించెను.”
“దక్ష యజ్ఞంలో సతీదేవిని కోల్పోయిన శివుడు ఖిన్నుడై తలవాల్చి ఉండగా, చంద్రుడు నేలకి సమీపించడం చూసి చీమ చంద్రుడ్ని చుంబించెను.”

ఈ సమాధానాలు ఆశువుగా అప్పటికి అప్పుడు చెప్తారు. ఇంకొక విషయం. ఈ సభలు సంస్కృతంలో అవుతాయి. ఈ సభలో గణపతి శాస్త్రికి “కావ్య కంట” అనే బిరుదు వచ్చింది. శ్రీ రమణ మహర్షి ఇతనిని “నాయన” అని పిలిచేవారు. ఇతనికి ముని అని కూడా బిరుదు ఉండేది.

In a small village called Kalavarai near Bobbili in AP, a young poet was born. His name was Ganapathi Sastry. He travelled to a place called Navadweepam, where lot of poetic conventions used to be held. These used to be the places where young poets were tested on various aspects and were presented with titles.

With great difficulty, he could procure an invitation. It was headed by a great north Indian poet by the name Ambikadatta. Seeing him, Ganapathi asked, “Who is this great man?” Everyone was shell shocked.

“I am a great poet capable of impromptu and quick responses and I am ambikadatta.”
Datta in sanskrit means adopted. Ambika is goddess Paarvathi. But this was not a complete poem and the intention was to inform Ganapathi to complete.

Without any hesitation Ganapathi responded, “You are an adopted son of Ambika, where as I am the real son of Ambika.” Lord Ganesha is son of Paarvathi.
Everyone was surprised.

Ambikadatta invited him onto the stage and gave him some questions. As part of these questions, basically one phrase will be given (looks pretty much contradictory or meaningless) and a poem has to be constructed impromptu justifying the phrase provided as a question.

Question 1: Removed the top of saree (pallu) and sought her father in law. But she is a good woman.
“Not able to bear the heat, Hidimba removed the top of her saree and sought some air.”
Hidimba is the Wife of Bheema and Bheema is son of Vaayu (Lord of Winds and air).

Question 2: Once in a year, Paarvathi does not see her husbands face.
“Fearing that she might have to see the moon on Vinaayaka Chaturdhi, Paarvathi avoids looking at her husband on that day.”
Paarvathi placed a curse on Chandra (moon), that if any one sees his face on Vinaayaka chaturthi day, they will have problems.

Question 3: The ant kissed the moon.
“When Lord Siva lost his wife satee devi in Daksha Yagnam, he was depressed and lied down. The moon, which is present on his head, touched the ground and seeing this, the ants came and touched (kissed) the moon.”
All the above are in sanskrit and as mentioned earlier impromptu. Ganapati Sastry was awarded “Kaavya Kanta” title in that poetic convention.

In his latter part of life Ganapathi Sastry was called Muni. The great Sri Ramana Maharshi used to call him “Naayana” fondly.


సర్వే జనాః సుఖినో భవంతు
PS: There could be typos and other mistakes in telugu and english, kindly pardon me with big hearts.

1 comment:

  1. meaning of datta is not exactly "adopted" it is "Taken" "Gifted" "Honoured" "Presented" "Protected". dattaka means adopted.

    ReplyDelete