గురు బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్ పాదం శంకరం లోక శంకరం
ఓం నమః శివాయ
This entire post has been written in Telugu primarily to ensure the usage of correct words. If anyone needs English translation, please let me know and I shall be glad to provide the same.
ఒకానొకప్పుడు కుశుడు అనే మహారాజుకి నలుగురు కొడుకులు ఉండేవారు. అందులో కుశనాభుడు ఒక కొడుకు. కుశనాభుడికి వంద మంది అప్సరసల వంటి కూతుర్లు ఉండేవారు. వారు ఘ్రుతాచి అనే అప్సరస వలన కలిగిన కుమార్తెలు. వారు రోజు ఒక కొండ మీద కూర్చొని చక్కగా పాటలు పాడుకుంటూ ఆనందంగా గడిపేవారు. వారందరూ సుగుణాల రాసులు అందులో మహా అందగత్తెలు.
ఒక నాడు వారు అలా పాటలు పాడుకుంటూ ఉండగా వాయు దేవుడు వారిని చూసి మోహించాడు. వెంటనే వారి దగ్గరికి వెళ్లి వారితో అన్నాడు, “మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. మీ అందరికి దేవతా స్థానులు వచేటట్టు చేస్తాను. నా మాట మర్నించి నన్ను పెళ్లి చేసుకోండి.”
ఇది విని వారందరూ ఒకే సారి తమ భావాన్ని వ్యక్తం చేసారు. “తండ్రి పంచన లేని అమ్మాయిలని ఇలా అడగడం మహా తప్పు. ఆడ పిల్లలు తమ తండ్రి ఎంచుకున్న వరుడిని పెళ్లి చేసుకోవాలి కాని ఇలా తమకి నచ్చిన వారితో వివాహం చేసుకోవడము సనాతన ధర్మం ఒప్పుకోదు. మా తండ్రి గారిని సంప్రదించక మాతో ఈ విషయం మాట్లాడినందుకు నిన్ను శపించగల సామర్ధ్యం ఉండి నీ పదవి నుండి నిన్ను తొలగించ గలిగిన నిన్ను శపించక వొదిలి పెడుతున్నాం. దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపో.”
ఈ మాటలు విన్న వాయు దెవుడికి ఆగ్రహం వచ్చి వారి శరీరాల నుండి బయటకి వెళ్లి, అంగ వైకల్యం కలిగించాడు. దానితో అందమైన వారి శరీరాలు ఎండు తోటకూర కాడల్లాగ వేలాడిపోయాయి.
వారందరూ ఇంటికి వెళ్లి కూల పడ్డారు. అప్పుడు వారి తండ్రి జరిగిన విషయం అడిగారు. జరిగిన వృత్తాంతం విని తండ్రి అడిగాడు. “అమ్మాయిలూ! మీకు వాయు దేవుడిని శపించాలని అనిపించలేదా?”
“లేదు నాన్నగారు. మనుష్యులకి అన్నిటి కంటే అతి ముఖ్యమైన లక్షణం క్షమా గుణమని మీరు చెప్పారు కదా. అందుకని మేము ఆగ్రహించకుండా వచ్చేసాము.”
ఇది విన్న ఆ తండ్రి ఎంతో మురిసిపోయాడు. వారు చేసిన పనికి చాలా మెచ్చుకున్నాడు. ఓర్పుని మించిన గుణం లేదని చెప్పాడు.
కాని కుశనాభుడు తన పిల్లలకి పెళ్లి చెయ్యాలని నిశ్చయించాడు. ఇలాంటి అందవిహీనులని పెళ్లి ఎవరు చేసుకుంటారని బెంగ పడ్డాడు.
అదే సమయంలొ చూళి అనే ఒక మహర్షికి, ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతొ, “నేను నీకు ఏమిచెయ్యగలను?” అని అడిగారు.
అప్పుడామె, “నేను ఎవరికీ భార్యని కాను, కాని అపారమైన తపఃశ్శక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన, శారీరిక సంపర్కం లేకుండా, మానసికమైన తపఃఫలంతో నాకు కుమారుడు కావాలి.”
అప్పుడు ఆ మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానస పుత్రుడిని సోమదకి ప్రసాదించారు. బ్రహ్మదత్తుడు పుట్టుక తోనే బ్రహ్మజ్ఞాని.
కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుడు ఒక్కొక్క అమ్మాయి పాణి గ్రహణం చేస్తూంటే వారి అంగవైకల్యం పోయి, వాళ్ళు మళ్ళి పూర్వ సౌందర్యాన్ని పొందారు.
సర్వే జనాః సుఖినో భవంతు
PS: There could be typos and other mistakes in telugu and english, kindly pardon me with big hearts.
No comments:
Post a Comment